జయలలితకు షరతులేమీ లేవా?

no-rules-for-jayalalitha

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలుగానీ, సూచనలుగానీ తీర్పు ప్రతిలో లేవు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతోపాటు మరో ముగ్గురికి శుక్రవారం బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని షరతులను విధించింది. ప్రత్యేక న్యాయస్థానం వేసిన శిక్షపై కర్ణాటక హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లినప్పుడు రెండునెలల్లోగా (డిసెంబరు 17లోగా) అన్ని వివరాలు (పేపర్‌బుక్‌) సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. గడువును ఒక్క రోజు కూడా పొడిగించటం కుదరదని స్పష్టం చేసింది. అప్పీల్‌పై విచారణను మూడునెలల్లో పూర్తి చేయాలని కర్ణాటక హైకోర్టుకు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, శనివారం వెలువడిన తీర్పుప్రతిలో ఇవేవీ లేవు. జయలలిత, శశికళ, సుధాకరణ్‌, ఇళవరసిలకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను నిలిపివేస్తున్నామని.. వారినుంచి నిబంధనల ప్రకారం బాండును, ఒక్కొక్కరికి ఇద్దరు వ్యక్తుల చొప్పున పూచీకత్తును తీసుకొని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. తదుపరి విచారణను డిసెంబరు 18కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment