మళ్లీ అమ్మకు నిరాశే.... బెయిల్ కు నో...

పురచ్చితలైవికి మరోసారి నిరాశే ఎదురైంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.  బెయిల్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అభ్యంతరం వ్యక్తం చేయటంతో జయకు బెయిల్ ఇవ్వటం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈనెల ఏడో తేదీన హైకోర్టు సాధారణ బెంచ్ లో విచారణకు ఆదేశించింది. కాగా జయ తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు తాజా తీర్పుతో అమ్మతో పాటు అన్నాడీఎంకే వర్గాలకు మళ్లీ నిరాశే ఎదురైంది. దాంతో జయలలిత దసరా పండుగకు జైల్లోనే గడపనున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment