అభిమాని మృతికి రెండు లక్షలు ప్రకటించిన నటుడు

ramcharan-help-twolaksh-hisfan
తన సినిమా చూసేందుకు వచ్చి మృత్యువాత పడిన అభిమానిని ఆదుకునేందుకు హీరో రామ్ చరణ్ ముందుకు వచ్చారు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా చూడానికి వెళ్లి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కన్నయ్య అనే అభిమాని మృతి చెందాడు. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కన్నయ్య మృతి పట్ల రామ్ చరణ్ సంతాపం ప్రకటించారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అతడి కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు. ఈమేరకు రామ్ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ధియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కన్నయ్య చనిపోయాడని అభిమానులు విమర్శించారు. నిన్న విడుదలైన గోవిందుడు అందరివాడేలే మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment