ఆ హీరో.. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరిందంట!

ramcharan-kajalagarwal-good-chemistry
‘గోవిందుడు అందరివాడేలే’ ద్వారా కాజల్ అగర్వాల్ హ్యాట్రిక్ దాటిందా?  రామ్‌చరణ్‌తో కాజల్ ఇప్పటివరకు ముచ్చటగా నాలుగు సినిమాలు చేసింది. ‘మగధీర’, ‘నాయక్‌’ 'ఎవడు' హిట్టయిన సంగతి తెల్సిందే! బుధవారం థియేటర్లలోకి వచ్చింది ‘గోవిందుడు అందరివాడేలే’. ఇందులో ట్రెడిషన్ అమ్మాయిగా కాజల్ యాక్టింగ్ అదుర్స్! ‘చందమామ’ కంటే న్యూలుక్‌లో కనిపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఒకవిధంగా చెర్రీతో కాజల్ కెమిస్ర్టీ బాగానే వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. గతంలో రాధ, విజయశాంతితో నటించి కంటిన్యూగా హిట్ కొట్టిన చిరంజీవి దారిలోనే చెర్రీ కూడా పయనిస్తున్నాడని అంటున్నారు. రోజుకో హీరోయిన్ వచ్చే ఈ రోజుల్లో ఒక బ్యూటీతో మూడు చిత్రాలు విజయం సాధించడం ఓ రికార్డ్‌గానే మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ లెక్కన శ్రీనువైట్లతో చరణ్ చేయబోయే నెక్ట్స్ మూవీలో కాజల్‌ని తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment