మోడీ ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోంది! : సూప్రింకోర్టు

అహరహం శ్రమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు గురువారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతుల మంజూరులో మోడీ ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలం నిద్రపోతూ కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, తన బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతూ ‘రిప్ వ్యాన్ వింకిల్’లా ప్రవర్తిస్తోందని కూడా ధర్మాసనం పేర్కొంది. 
అనకనంద, భగీరథి నదులపై ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలో నిర్మించ తలపెట్టిన 24 జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తున్న తీరు, పై రెండు నమూనాల మాదిరిగానే ఉందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారిమన్ ల నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
‘‘ఇప్పటికే నివేదిక ఇక్కడ ఉండాల్సింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ తప్పిదమే. మీరు నిజంగా కుంభకర్ణుడిలానే వ్యవహరిస్తున్నారు. మా ముందు నివేదికను ఎందుకు పెట్టలేకపోతున్నారో అర్థం చేసుకోవడం మాకు సాధ్యం కావడం లేదు. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? ఇప్పటికే చాలా సమయమిచ్చాం. రిప్ వ్యాన్ వింకిల్ లా ఉన్నారే!’’ అంటూ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment