తుఫాన్ నేపథ్యంలో 37 రైలు సర్వీసుల రద్దు

trains-cancelled-hudood
హుదూద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది.  ఈస్ట్ కోస్ట్ పరిధిలో 37 రైలు సర్వీసులను రద్దు చేయగా, మరో 31 రైలు సర్వీసులను దారి మళ్లించారు. ఈ నెల 11, 12 తేదీల్లో బెంగళూరు-భువనేశ్వర్- ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ను, 12వ తేదీ బెంగళూరు-యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు.
రద్దయిన మరికొన్ని రైళ్ల వివరాలు..
రేపు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన తిరుపతి-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 8.30 ని.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్-విశాఖపట్న దురంతో ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 8.15 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్-విశాఖపట్నం గరీభ్ రధ్ ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 8.30 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన తిరుపతి-విశాఖపట్నం తిరుమల ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 9 గం.లకు విజయవాడ నుంచి బయలుదేరాల్సిన విజయవాడ-రాయగఢ్ పాసెంజర్
రేపు రాత్రి 9.15 గం.లకు మచిలీపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం పాసెంజర్
రేపు రాత్రి 11.05 గం.లకు నర్సాపురం నుంచి బయలుదేరాల్సిన నర్సాపూర్-భీమవరం పాసెంజర్
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment