కాజల్ అగర్వాల్ పై కరుణానిధి మనవడి ఫిర్యాదు

udyanidhi-case-on-kajal
మంచి మేని ఒంపులతో కుర్రకారుకు కిక్కెస్తున్న కాజల్ మీద కరుణానిధి మనవడు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కేసు నమోదు చేశారు. ఓరు కలాల్ ఓరు కన్నడి తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తన చిత్రం 'నన్పెండా' లో కాజల్ ను ఎంపిక చేసి అడ్వాన్సుగా 40 లక్షల చెల్లించారని.. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ ను ఆ చిత్రం నుంచి తొలగించి.. నయనతారను ఎంపిక చేశారు. అడ్వాన్సు మొత్తంగా చెల్లించిన డబ్బును వాపసు చేయాలని కోరగా.. అందుకు కాజల్ తిరస్కరించడంతో ఆ అంశం వివాదంగా మారిందని తమిళ మీడియా కథనంలో పేర్కొన్నారు. అయితే తాను ఉదయ్ నటించే తదుపరి చిత్రంలో నటించడానికి ఓకే చెప్పానని.. డబ్బు తిరిగి ఇచ్చేది లేదని చెప్పడంతో వివాదం మరింత ముదిరిన్నట్టు సమాచారం. అయితే చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మోసగించారనే ఆరోపణలపై నిర్మాతల మండలిలో ఉదయనిధి ఫిర్యాదు నమోదు చేశారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment