బాబు వల్లే విశాఖలో ప్రాణనష్టం తగ్గింది : వి.హనుమంతరావు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. తుపాను సహాయక చర్యలను చంద్రబాబు సమర్థవంతంగా చేపడుతున్నారని కొనియాడారు. చంద్రబాబు ముందు జాగ్రత్తల వల్లే ప్రాణ నష్టం భారీగా తగ్గిందని అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో వెలువడుతున్న ఫలితాలపై స్పందిస్తూ... ఈ రెండు రాష్ట్రాల్లో పదేళ్లకు పైగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. అక్కడి ప్రజలు మార్పును కోరుకున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీపై వారికి వ్యతిరేకత లేదని అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చూద్దామని ఓటర్లు భావించారని చెప్పారు. కొత్తగా పెళ్లయిన వాడు సాయంత్రం 8 గంటలకే ఇంటికి వెళతాడని... ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నెమ్మదిగా వెళతాడని... ఇదీ అంతేనని ఉదాహరణగా చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకే తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారని... ఆయన పర్యటను రాజకీయం చేయవద్దని కోరారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment