టీఆర్ఎస్ కొట్టుకు పోతుంది... టీడీపీ భవిష్యత్ రెండు నెలల్లో తేలుతుంది : వై ఎస్ జగన్

2019లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైకాపానే అని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని... ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీ కొట్టుకుపోతుందని చెప్పారు. చివరకు తెలంగాణలో మిగిలేది వైకాపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే అని తెలిపారు. ఏపీలో మరో నాలుగు నెలల్లో టీడీపీపై వ్యతిరేకత వస్తుందని అన్నారు. ఈరోజు హైదరాబాద్ అత్తాపూర్ లోని క్రిస్టల్ గార్డెన్స్ లో వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను వస్తానని... ధర్నా చేస్తానని అన్నారు. 2019లో తెలంగాణలో వైకాపా జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment