లక్ష్మి ధనరాజ్ లపై క్లాప్ ఇస్తున్న రాఘవేంద్రరావు

మంచు లక్ష్మి మళ్లీ నటిగా బిజీ అవుతోంది. తాజాగా ఆమె కథానాయికగా నటించే చిత్రానికి 'పిలవని పేరంటం' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఆమధ్య 'జగన్ నిర్దోషి' అనే చిత్రాన్ని రూపొందించిన వెంకన్నబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. విశేషం ఏమిటంటే, హాస్యనటుడు ధనరాజ్ ఇందులో లక్ష్మి పక్కన జంటగా నటిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు హైదరాబాదులో ప్రారంభమైంది. మంచు లక్ష్మి, ధనరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. హారర్ కామెడీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే మంచు లక్ష్మి 'చందమామ కథలు' చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment