అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న కేసీఆర్ : రమణ

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై విమర్శనాస్త్రాలు సంధించారు. అన్నం పెట్టే రైతుకు కేసీఆర్ సున్నం పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రైతు కన్నెర్ర చేస్తే కేసీఆర్ కాలగర్భంలో కలుస్తారని హెచ్చరించారు. కేసీఆర్ పాలన అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న విధంగా ఉందని విమర్శించారు. అన్నదాతలకు టీడీపీ అండగా ఉంటుందని ఉద్ఘాటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చెల్లించాలని రమణ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఆదిలాబాద్ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment