Video Of Day

Breaking News

సూర్య మూవీ సెట్ లో రవితేజ, రానా..

surya-movie-set-raviteja-rana
సూర్య మూవీ సెట్ కు ఇద్దరు హీరోలు వెళ్లారంటే ఇంకేమైనా ఉందా? సందడే సందడి. తాజాగా హైదరాబాద్ లో అదే జరిగింది. తమిళ హీరో సూర్య నటిస్తున్న మూవీ మాస్. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మూమూలుగానే ఒక హీరో సెట్ కు మరో హీరో వెళ్లడం జరగదు. అంత టైం కూడా ఉండదు. సెట్ కు హీరో రాగానే మేకప్ వేసుకోని, షాట్ ఓకే చేసుకొని, ప్యాకప్ చెప్పేసి వెళ్తూ ఉంటారు. రెగ్యులర్ గా అదే సీన్ రిపీట్ కంటిన్యూ అవుతోంది. కానీ సూర్య మూవీ సెట్ లో అలాంటిది ఏమీ జరగలేదు ఈ సెట్ కు మాస్ రాజా రవితేజతో పాటు, దగ్గుబాటి రానా వెళ్లారు. సూర్యతో పాటు మూవీ యూనిట్ తో కలిసి రవితేజ, రానా సెల్ఫీ దిగారు. సెట్ లో కాసేపు హడావుడి చేశారు. ఫ్రెండ్స్ కావడం వల్లే సూర్యను కలిశామని తర్వాత ఈ టాలీవుడ్ హీరోలు చెప్పుకొచ్చారు.

No comments