విద్యుత్ పై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవం ఆమోదం

విద్యుత్ అంశంపై తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందంటూ తీర్మానంలో పేర్కొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ రావాల్సిన విషయాన్ని ఏపీ దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఏపీ విద్యుత్ ఇవ్వకపోతే, కేంద్రం ఆ రాష్ట్రాకి ఇచ్చే విద్యుత్తును తెలంగాణకు ఇవ్వాలని తెలిపారు. తీర్మానం ఏపీ సర్కారుకు వ్యతిరేకం కానీ, పార్టీలకు కాదన్నారు. వర్షం వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఉందన్నారు.
అటు, తెలంగాణలో రైతుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు 53.89 శాతం విద్యుత్తును విభజన చట్టంలో యూపీఏ కేటాయించిందన్నారు. రైతులకు సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు 7 గంటల విద్యుత్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 4 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడంలేదని విమర్శించారు. రైతులకు రుణాలు ఇవ్వడంలోనూ సర్కారు విఫలమైందన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment