బెంగుళూరులో పేలుడు ..మహిళ మృతి

బెంగళూరులోని చర్చి స్ట్రీట్‌లో స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం మాల్యా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మహిళా ఉంది. మహిళా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. ఫొరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పేలుడు తీవ్రత తక్కువగా ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment