Video Of Day

Breaking News

రామోజీతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్: రాజధాని శివారులోని రామోజీ ఫిలింసిటీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన ఫిలింసిటీకి వెళ్లారు. దాదాపు ఐదు గంటల పాటు అక్కడే గడిపారు. బర్డ్ పార్క్‌ను, ఇతర ప్రదేశాలను తిలకించారు. ఫిలింసిటీ అధినేత రామోజీరావుతో కలసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్రంతో స్నేహపూర్వక వైఖరితో వెళితే బాగుంటుందని, తెలంగాణకు, హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌కు రామోజీ సూచించారు. హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. తాను తదుపరి చేపట్టబోయే ‘ఓం’ ప్రాజెక్టు గురించి కూడా ముఖ్యమంత్రికి రామోజీరావు వివరించినట్లు సమాచారం.
 

No comments