Video Of Day

Breaking News

మొయినాబాద్ లో రేవ్ పార్టీపై పోలీసుల దాడి

మొయినాబాద్: రేవ్ పార్టీలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి.  విలాసాలకు అలవాటుపడిన యువత రేవ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మత్తులో జోగుతూ అనైతిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో రేవ్ పార్టీ బాగోతం బయపడింది. ఓ ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై సోమవారం రాత్రి సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 8 మంది ముంబై మోడల్స్, 22 మంది యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

No comments