Video Of Day

Breaking News

పవన్ కష్టం ఫలించింది - శ్రీజ నడుస్తోంది, మాట్లాడుతోంది

ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారి శ్రీజ మృత్యువుతో పోరాడి గెలిచింది. తీవ్ర అనారోగ్యం పాలై, అస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. గతంలో శ్రీజ ఆస్పత్రిలో ఉన్న సమయంలో సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఆమెను పరామర్శించిన విషయం తెలిసిందే. పవన్‌ సహా శ్రీజ బంధువుల ప్రార్థనలు ఫలించి ఆమె కోలుకుంది. ఖమ్మంలోని కార్తీక ఆస్పత్రిలో తల్లిదండ్రులు, పవన్‌ అభిమానుల మధ్య శ్రీజ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది. తను సెవెన్త్‌ క్లాస్‌ చదువుతున్నట్లు చెప్పింది. నాకు ఇష్టమైన హీరో పవన్‌ కల్యాణ్‌ అని కూడా చెప్పింది.

No comments