పెళ్లిలో గల్లాలు పట్టుకున్న విష్ణువర్ధన్‌, వంశీచందర్‌

వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. వీరి పేర్లు విష్ణువర్ధన్‌ రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి. విష్ణువ ర్ధన్‌ రెడ్డి సుప్రసిద్ధ కాంగ్రెస్‌ నాయకుడు పిజెఆర్‌ కుమారుడు. వంశీచందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే. వేదిక హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌. అక్కడ విష్ణు బావమరిది వివాహం జరుగుతోంది. అక్కడ ఆకస్మికంగా జరిగిన సంఘజన వివాహానికి వచ్చిన అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇద్దరిమధ్యా ఏమైందో ఏమో ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. వారిది తప అంటే వారిది తప అని పరస్పరం ఆరోపించుకున్నారు. చిన్న ఘర్షణగా ప్రారంభమై చినికి చినికి గాలివానగా మారి ఇరువురూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకునేవరకూ వెళ్లింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోవడంలేద ంటూ విష్ణు, తమ తల్లితో కలిసి ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు విష్ణు ఫిర్యాదును కూడా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment