Video Of Day

Breaking News

బీజేపీ, కాంగ్రెస్ ను ఊడ్చేసిన కేజ్రీవాల్

న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఏలుతూ వస్తోంది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో అమాత్యులు మకాం వేసి ఉన్నా.. కే్జ్రీవాల్ ముందు వారి ఆటలు సాగలేదు. ఎందుకంటే మంగళవారం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ ఉద్దండులకు కంటికి నిద్ర లేకుండా చేసిన ఘనత కేజ్రీవాల్.. నల్లధనం, అవినీతిపై ఉద్యమంలా వచ్చిన అన్నా హజారే టీం లోని ఒక నాయకుడు కేజ్రీవాల్.. మొదట్లో 2013లో ఎన్నికల్లో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ  (ఆప్) అనుకోని విధంగానే ఫలితాలు సాధించినా.. సరైన మాజిక్ ఫిగర్ లేక కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పటికీ .. ఆ పార్టీ నేతల ఒత్తిడి కేజ్రీకి నచ్చలేదు.. దీంతో సీఎం పదవి తనకు ముఖ్యం కాదంటూ రాజీనామా చేశారు. అనంతరం  2015లో అనంతరం ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇతర పార్టీలైన కాంగ్రెస్, బీజేపీని పార్టీ గుర్తు చీపురుతో ఊడ్చేసినంత పని చేసింది. మొత్తం 70 సీట్లున్న అసెంబ్లీకి 67 సీట్లను గెలిచిన ఆమ్ ఆద్మీ అతిపెద్ద పార్టీగానే కాకుండా.. 5 సంవత్సరాలుగా తిరుగులేని ప్రజా నేతగా.. సీఎంగా పాగావేశారు. ఢిల్లీ కోటలోనే ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీల ప్రచారాలు అంతగా ఓటర్లను ఆకట్టుకోలేక పోయాయి. మరో నేత కిరణ్ బేడీ ఇటీవలనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈమె కూడా అన్నా హజారే వృక్షంలోని ఒక కొమ్మనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ విజయం మొత్తం అన్నా హజారేకే చెందుతుందని భావన. 

No comments