Video Of Day

Breaking News

వీణా-వాణీలకు శస్త్రచికిత్స చేయాలని నిర్థారించాం

 గత 12 ఏళ్లుగా తలలు అతుక్కుని నరకయాతన అనుభవిస్తున్న అవిభక్త కవలు వీణా-వాణీలకు లండన్‌ వైద్యులు ఆశలు చిగురింపచేశారు. శనివారం నగరానికి చేరుకున్న గ్రేట్‌ ఆర్మండ్‌ స్ర్టీట్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ డేవిడ్‌ డునావే, డాక్టర్‌ జిలానీలు నిలోఫర్‌లో ఉన్న వీణా-వాణీలకు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైద్యులు వీణా-వాణీకి వైద్య పరీక్షలు నిర్వహించామని, శస్త్ర చికిత్స చేయాలని నిర్దారణకు వచ్చామని తెలిపారు. ఆపరేషన్‌ 80 శాతం సక్సెస్‌ అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. గతంలోనూ ఇలాంటి రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. వీణా-వాణీని లండన్‌ తీసుకెళ్లి ఆపరేషన్‌ చేస్తే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. నాలుగు దశల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని ఆరు నుంచి 9 నెలల సమయం పడుతుందని లండన్‌ వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు వీణా-వాణికి ఆపరేషన్‌ తమకు అంగీకారమే అని, లండన్‌లో ఉండటానికి సిద్ధమే అని తల్లిదండ్రులు తెలిపారు.

No comments