ఆ ఎమ్మెల్యే మాటలు ఆపితే .. నేను తలనొప్పి తగ్గించుకుంటా : ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి

 ఉప ముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తి, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంధ్రనాధ్‌రెడ్డి మధ్య అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజేంద్రనాధ్‌ మాటలు వినీ వినీ తలనొప్పి వస్తోందని, ఆయన ప్రసంగం ఆపితే తలనొప్పి తగ్గించుకుంటామని ఉపముఖ్యమంత్రి అన్నారు. జమీందార్ల కుటుంబం నుంచి వచ్చిన రాజేంద్రనాధ్‌కు పేద ప్రజల గురించి తెలియదని ఆయన అన్నారు. ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి ప్రతిసారీ ఎడమ చేయి పైకెత్తి అరె .. సాంబ మాట్లాడు అన్నట్టు చూపుతాడని ఎద్దేవా చేశారు. దానికి రాజేంద్రనాధ్‌ సమాధానమిస్తూ నాకు ఉప ముఖ్యమంత్రి అంకుల్‌ అవుతారు. ఆయన నాకు చిన్నప్పుడు ఐస్‌క్రీములు, చాక్లెట్లు కొనిపెట్టారు కనుక ఆయన్ను ఏమీ అనలేనని అన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment