ఇద్దరు చంద్రుల సమస్యలు గవర్నర్ నరసింహన్ పరిష్కరిస్తారా?

ఇటీవల రాష్ర్టంలో వివాదాస్పదంగా మారిన ఓటుకు నోటు వ్యవహారం, ట్యాపింగ్ రెండు అంశాలపై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. పంచాయతీ కాస్తా ఢిల్లీ పెద్దలకు చేరింది. దీంతో కోపోద్రిక్తులైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. దీంతో అంతే స్వరంతో ఏపీ సీఎం చంద్రబాబు నన్ను అరెస్టు చేస్తే అదేరోజు నీ ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించడం వంటి సంఘటనలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న సన్నివేశాలు. కాగా ఢిల్లీ పెద్దలకు రెండు రాష్ర్టాల సమస్యలను వివరించిన గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ర్టాల సీఎంలను పిలిపించుకొని ఇరువురి సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీ సూచించినట్లు సమాచారం. అయితే నేడో రేపో గవర్నర్ నరసింహన్ వద్దకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరువురిని పిలిపించుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి నరసింహన్ ఏ మేరకు ఇరు రాష్ర్టాల సీఎంల సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment