దివంగత నేత పీవీ నరసింహారావుకు నాయకుల నివాళులు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహారావు, హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, జానారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. పీవీ ఘాట్ వద్దకు నేతలు ఉదయం నుంచి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. పీవీ సేవలను కాంగ్రెస్‌ మరిచిపోదన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి పీవీ అని జానారెడ్డి తెలిపారు. పీవీ ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తిగా పీవీని నాయిని అభివర్ణించారు. 

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment