తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను పశ్నించిన జనసేన

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తి విమర్శలు, కుట్రలకు దిగుతూ.. వారి ఇరువురి ఆధిపత్యాన్ని, సమస్యలను ప్రజలపై రుద్దడం మంచిది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగిందని, ఈ అన్యాయాన్ని ఎదురించేందుకు కేంద్రంలో ఎంపీలు ఏమి చేయలేక పోతున్నారని, అంతేకాదు తమ వ్యాపార లావాదేవీలపై ఉన్న ప్రేమ తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే ఆంధ్రా పేరును ఉచ్చరిస్తూ దూషణలకు దిగడం మంచిది కాదని.. ఆంధ్రా అంటే చంద్రబాబు, టీడీపీ.. కాంగ్రెస్ పార్టీలు కాదని అది ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా పేర్లు పెట్టుకుని మీరు తిట్టుకోవాలని.. కాని ప్రాంతాల పేరుతో దూషించడం మంచి సంస్కృతి కాదన్నారు. ఇకనైనా ఇరు రాష్ర్టాల సీఎంలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. చాలా సమస్యలు తెలుగువారి వద్ద ఉన్నాయని ఇరువురు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. లేకుండా చేతకాకపోతే దిగిపోవాలని. చెప్పారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment