Video Of Day

Breaking News

'భల్లాల దేవ'కే మొదటి అవార్డు..

rana-wins-his-first-award-for-baahubali

 డైరెక్టర్ రాజమౌళి తీర్చిదిద్దిన 'బాహుబలి' బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.   ఈ సినిమాలో హీరోగా చేసిన ప్రభాస్ కంటే నెగటివ్ రోల్ పోషించిన రానాకే చిత్రం తరఫున మొదటి అవార్డు దక్కనుంది. అదేమిటంటే 'వరల్డ్ ఫిలిం ఫెస్టివల్స్‌'లో బాహుబలి చిత్రాన్ని తాజాగా ప్రదర్శిస్తున్నారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు 'భల్లాల దేవ' పాత్ర ద్వారా ప్రభాస్‌కి గట్టి పోటీనిచ్చి అద్భుతంగా నటించిన రానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో డిసెంబర్ 2న జరగనున్న ప్రతిష్ఠాత్మకమైన 'ఆసియా విజన్ మూవీ అవార్డ్స్ 2016'లో బాహుబలి చిత్రానికి మొదటి అవార్డును రానా అందుకోనున్నాడు. సినిమాలో తన నటనకు గాను రానా ఈ అవార్డును చేజిక్కించుకోనున్నాడు. ఇదే విషయాన్ని రానా తన 'ట్విట్టర్ అకౌంట్‌'లో పోస్ట్ చేసి అందరితో ఆనందాన్ని పంచుకున్నాడు.

No comments