చిరుకు జోడీగా నర్గిస్‌ ఫక్రీ...

చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రంలో హీరోయిన్ గా రోజుకో పేరు వినపడుతోంది. మొదట అనుష్క, తర్వాత నయనతార అని గుసగుసలు వినిపించినా... తాజాగా వీరెవరూ కాదంటూ మరో బాలీవుడ్‌ భామ నర్గిస్‌ ఫక్రీ చిరు జోడిగా నటిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం.
'కత్తిలాంటోడు' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment