ఎన్టీఆర్ కు ఇప్పుడు అది చాలా సులభమైపో్యింది..!

NTR Koratala Siva New Moive Janatha Garage 60 crore
నిన్న మొన్నటి వరకూ ... ఎన్టీఆర్ కెరీర్ కు అదొక పెద్ద లోటు. అయితే.. ఇప్పుడు చాలా ఈజీగా ఆ ఫీట్ను చేసేస్తున్నాడు.. చాలా సంవత్సరాలుగా తను కష్టపడిన ఫీట్ ను అలవోకగా సాధిస్తున్నాడుజూనియర్ ఎన్టీఆర్. ఇదంతా రూ.50 కోట్ల సినిమా విషయంలో! మొన్నటి వరకూ ఎన్టీఆర్ ఈ విషయంలోచాలా కష్టపడ్డాడు. అవతల తన కన్నా వెనుక వచ్చిన హీరోలు.
. కోట్ల రూపాయల రికార్డులను ఇట్టేసృష్టించేస్తుంటే.. ఎన్టీఆర్ కు మాత్రం అదొక పెద్ద కొండలా కనిపించింది!

అయితే అదంతా నిన్నటి వరకూ.. 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల కానంత వరకూ! ఆ సినిమావిడుదల అయ్యాకా మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే 'నాన్నకు ప్రేమతో' ఎన్టీఆర్ డ్రీమ్ను ఫుల్ ఫిల్ చేసిందో.. ఆ తర్వాత ఆ స్థాయి బిజినెస్ అనేది ఎన్టీఆర్ కు చాలా ఈజీ అయిపోయింది. 'జనతా గ్యారెజీ' అయితే ఇంకా కొబ్బరి కాయ కొట్టక మునుపే రూ.60 కోట్ల రూపాయలకు చేరడమేఇందుకు నిదర్శనం!

ఓవర్సీస్ రైట్స్ విషయంలో జనతాగ్యారేజీ.. ఇతర తెలుగు సినిమాలు సృష్టించిన రికార్డులను బ్రేక్ చేసేలాఉంది. ఇక.. శ్రీమంతుడు సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తుండటం, ఎన్టీఆర్వరసగా రెండు హిట్లతో ఫామ్ లో ఉండటంతో.. లోకల్ గా కూడా ఈ సినిమా భారీ బిజినెస్చేయనుంది.మోహన్ లాల్ నటిస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కూడా బాగానే పలికేఅవకాశం ఉంది. ఇక శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏతావాతా ఎన్టీఆర్ సినిమారూ.60 కోట్ల రూపాయల బిజినెస్ ను ఇట్టే సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment