ఆ సినిమాను పవన్ చేస్తాడా.. బాలయ్య చేస్తాడా?!

Pawan Kalyan_Balakrishna New Movie Remake Vedalamతమిళంలో హిట్టైన అజిత్ సినిమా 'వేదాళం' రీమేక్ గురించి టాలీవుడ్ లో ఊహగానాలుకొనసాగుతున్నాయి. తెలుగులో ప్రముఖ హీరోలు ఈ సినిమా ను రీమేక్ చేయడంపై దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమా పై నందమూరి బాలకృష్ణ
దృష్టి సారించినట్టుగావార్తలు వచ్చాయి. అజిత్ హీరోగా రూపొందించిన ఈ సినిమా బాలయ్యకు అయితే సరిగ్గా సెట్అవుతుందని.. నందమూరి నటసింహం ఈ సినిమాను రీమేక్ చేయడం దాదాపు ఖాయమని వార్తలువచ్చాయి.

అయితే ఈ విషయం ఇంకా ధ్రువీకరణ కాలేదు. దీన్ని  బాలయ్య రీమేక్ చేస్తాడో చేయడో.. ఇంకా క్లారిటీలేదు. ఇంతలోనే ఈ రీమేక్ విషయంలో  పవన్ కల్యాణ్ పేరు చర్చల్లోకి రావడం విశేషం. ఈ సినిమాపైదృష్టి పెట్టాడట పవన్ కల్యాణ్. ఇది వరకూ పవన్ అనేక తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేశాడు.ఈ నేపథ్యంలో అజిత్ తాజా సినిమాపై కూడా పవన్ కన్నేశాడని.. దాన్ని తెలుగులో రీమేక్ చేయడంపట్ల ఉత్సాహం చూపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ ఈ సినిమా తమిళ వెర్షన్ నుకూడా చూసినట్టు గా తెలుస్తోంది. రీమేక్ పట్ల ఉత్సాహంతోనే ఉన్నట్టుంది తెలుస్తోంది.

అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. అజిత్ "వేదాళం'' సినిమా ఇది వరకూ తెలుగులో ఎన్టీఆర్చేసిన 'ఊసరవెల్లి' కి దగ్గరదగ్గరగా ఉందని సినీ విశ్లేషకులు తేల్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలోఎన్టీఆర్ హీరోగా ఆ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. మరి ఇప్పటికే తెలుగులో అలాంటి సినిమాఒకటి వచ్చినా.. ఇద్దరు తెలుగు టాప్ హీరోలు 'వేదాళం' రీమేక్  పట్ల ఉత్సాహం చూపిస్తుండటంవిశేషమే కదా!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment