బన్నీ.. ఇక నెక్ట్స్ టార్గెట్ అక్కడ సత్తా చాటడమే!

Allu Arjun New Movies Dubbing Tamil & Malayalam
తెలుగు స్టార్ హీరోల్లో ముందుగా.. బోర్డర్ దాటి పరాయి భాషల్లో సత్తా చాటిన హీరో అల్లు అర్జున్. తన సినిమాలు మలయాళంలోకి డబ్ కావడం ద్వారా అల్లు అర్జున్ అక్కడ జెండా పాతాడు. అక్కడి హీరోలకు సమానమైన స్థాయి మార్కెట్ నే ఆక్యుపై చేశాడు అల్లు వారి పిల్లగాడు. కొన్ని సంవత్సరాలుగా తెలుగుతో పాటు ఒకేసారి మలయాళంలోకూడా విడుదలైపోతున్నాయి బన్నీ సినిమాలు. ఇతడి సినిమాలు తెలుగులో అయినా ప్లాఫ్ అవుతున్నాయేమో కానీ.. మలయా
ళంలో మాత్రం ప్లాఫ్ కానంత స్థాయిలోదూసుకుపోతున్నాయి.

ఇక ఈ హీరో సినిమాలు తమిళంలోకి డబ్ కావడం కూడా రొటీనే! ఇతడి సినిమాలు వరసగా అక్కడ విడుదలవుతున్నాయి. తమిళంలో ఇతర తెలుగు హీరోలతోపాటు అల్లు అర్జున్ కూడా తనడబ్బింగులో ఆసక్తిని రేకెత్తించగలుగుతున్నాడు. ఇక కన్నడనాట అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నడలోకి సినిమాలు డబ్బింగ్ కావడం నిషేధమే అయినా... తెలుగు సినిమాలు అక్కడ యాథవిధిగా విడుదల అవుతాయి. వీటిలో భాగం గా బన్నీ సినిమాలు కూడా కన్నడ నాట విస్తృతంగా తెలుగు బాషలోనే విడుదల అవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో బన్నీ.. దకిణాది రాష్ట్రాలన్నింటిలోనూ.. నాలుగు భాషల్లోనూ సత్తా చాటినట్టు అవుతోంది. మరి ఇలా నాలుగు భాషలపై పట్టు సాధించిన బన్నీ.. తన తదుపరి ప్రయత్నాల్లో బాలీవుడ్ పై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు హిందీలోకి డబ్ అయినా.. మెల్లిమెల్లిగా తనమూవీస్ కి హిందీ భాషను కూడా ఒక మార్కెటింగ్ వనరుగా చేసుకునే యత్నంలో ఉన్నాడట స్టైలిష్ స్టార్! 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment