పవన్ తో రావాల్సిన దర్శకుడు.. అల్లు అర్జున్ ను నమ్ముకున్నాడు!


pawan_kalyan_allu_arjun_new_moive_director_lingaswamy
ఇప్పుడు కాదు దాదాపు పదేళ్ల క్రితమే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సింది... కానీ సాధ్యం కాలేదు. అప్పట్లో ఏకంగా పవన్ కల్యాణ్ డేట్లను సంపాదించినా.. సినిమా మాత్రం వర్కవుట్ కాలేదు. ఇది దర్శకుడు లింగుస్వామి విషయంలో. అప్పట్లో 'పందెంకోడి' వంటి సినిమా తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించడంతో లింగుస్వామి పై అందరి కన్నూ పడింది. అంతలోనే అప్పట్లో ఫుల్ జూమ్ మీద ఉన్న విక్రమ్ తో లింగుస్వామి సినిమా స్టార్ట్ చేయడంతో అందరి దృష్టీ ఆయనపై పడింది. పనిలో పనిగా పవన్ కూడా ఆయనపైదృష్టి సారించాడు!

లింగుస్వామి దర్శకత్వంలో ఏఎం రత్నం ప్రొడక్షన్ లో పవన్ కల్యాణ్ హీరోగా ఒక సినిమా ప్రారంభం కానున్నదని వార్తలు వచ్చాయి. 'బీమా' విడుదల తర్వాతర వీరి కాంబోలో సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమ ఫలితం లింగుస్వామి రాతను మార్చేసింది. కనీవినీ ఎరగని స్థాయి ప్లాఫుగా మిగిలింది 'బీమా' దీంతో లింగుస్వామిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఆ సినిమాకు నిర్మాత అయిన రత్నం పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో లింగుస్వామి తెలుగు ఎంట్రీ ఆగిపోయింది.

ఆ తర్వాత తమిళంలో పలు హిట్లను కొట్టి తన సత్తా చాటాడు లింగుస్వామి. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అతడిపై దృష్టి సారించారారు తెలుగు హీరోలు. అల్లు అర్జున్ - లింగుస్వామి కాంబోలో ఒక సినిమా రావడం ఖాయం అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనున్నదని తెలుస్తోంది. మొత్తానికి పవన్ హీరోగా రావాల్సిన సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన దర్శకుడు అల్లు అర్జున్ తో వస్తున్నాడనమాట!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment