మహేశ్ సినిమా ప్లాఫైనా.. వరసగా డబ్బింగవుతోంది!

Mahesh Babu Dubbing Movies Tamil & Malayalam
ఏనుగు చచ్చినా వెయ్యే.. బతికినా వెయ్యే.. అన్నట్టుగా, స్టార్ హీరోల సినిమాలు ప్లాఫైనా ఒకటే హిట్టైనాఒకటే అన్నట్టుగా మారింది పరిస్థితి. ప్రత్యేకించి డబ్బింగ్ ల విషయంలో ఇలాంటి పరిస్థితికనిపిస్తోంది.తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరసగా ఇతర భాషల్లోకి డబ్బింగ్ అయ్యే పరిస్థితివచ్చేసింది. ప్రత్యేకించి హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి తెలుగు స్టార్ హీరోల సినిమాలు డబ్అవుతున్నాయి.

అయితే ఈ డబ్బింగ్ ప్రక్రియ అనేది హిట్టూ ప్లాఫులకు నిమిత్తం లేనిదిగా మారింది. రాంచరణ్ , ప్రభాస్ ,అల్లు అర్జున్ తదితర హీరోల సినిమాలు తెలుగు ఫలితంగా ప్రమేయం లేకుండా.. ఇతర భాషల్లోకి డబ్అవుతున్నాయి. తెలుగులో వీరు చేసిన సినిమాలు కచ్చితంగా హిందీ, తమిళ భాషల్లోకి డబ్అవుతున్నాయి. అలాగే అప్పుడప్పుడు మలయాళీలు కూడా వీరి సినిమాలను డబ్ చేసుకొంటున్నారు.ఈ విషయంలో వీరికి తీసిపోవడం లేదు మహేశ్ బాబు!

ఈ హీరో నటించగా తెలుగులో రూపొందిన సినిమాలు ప్లాఫైనా కూడా అవి ఇతర భాషల్లోకి డబ్అవుతున్నాయి. ఇటీవలే శ్రీమంతుడు సినిమా తమిళంలోకి డబ్ అయ్యింది. తెలుగులో సూపర్ హిట్అయిన ఆ సినిమా అలా పక్క రాష్ట్ర భాషలోకి కూడా డబ్ కాగా, ఇప్పుడు దీని కన్నా ముందు సినిమా'ఆగడు' వంతు వచ్చింది. ఈ సినిమాను మలయాళంలోకి డబ్ చేస్తున్నారు. "పోకిరీ పోలీస్'' పేరుతో ఈసినిమా అక్కడ విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీలోకి డబ్ అయ్యింది.తమిళంలో కూడా విడుదలైనట్టుగా ఉంది. మరి ఇప్పుడు మలయాళం వంతు వచ్చింది. ఈ విధంగాతెలుగులో ప్లాఫైనా.. 'ఆగడు' ఇతర భాషల్లోకి వరసగా డబ్ అవుతోంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment