వైభవంగా కృష్ణానది పుష్కరాలు

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పుష్కరాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి కృష్ణానదిలో పుష్కరస్నానమాచరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ మండలం గొందిమళ్ల ఘాట్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పుష్కర స్నానమాచరించారు. నల్గొండ జిల్లా మట్టపల్లి ఘాట్‌లో తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పుష్కర స్నానమాచరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 57, నల్గొండ జిల్లాలో 28 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకోసం 13,474 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద 555 సీసీ కెమెరాలతో రెప్పవాల్చని నిఘా ఏర్పాటు చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment