ఆర్‌బీఐలో182 పోస్టులు

Image result for logo of reserve bank of indiaరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. గ్రేడ్ బీ ఆఫీసర్ల నియామకానికి రెండు ప్రకటనలను విడుదల చేసింది. ఒకటి జనరల్ విభాగంలోని పోస్టులకు కాగా, రెండోది డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల్లోని పోస్టులకు సంబంధించింది.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు 182 .
జనరల్ విభాగంలో-163. ఓపెన్ కేటగిరీకి 77 పోస్టులు, ఓబీసీలకు 52, ఎస్సీలకు 26, ఎస్టీలకు 8 పోస్టులు కేటాయించారు.
ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం (డీఈపీఆర్)లో-11.
స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం (డీఎస్‌ఐఎం)లో-8 పోస్టులు ఉన్నాయి.
వయోపరిమితి:
మూడు విభాగాల (జనరల్, డీఈపీఆర్, డీఎస్‌ఐఎం) పోస్టులకూ 2016 జూలై 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో వరుసగా 2, 4 ఏళ్ల సడలింపు ఉంటుంది.
 దరఖాస్తు రుసుం: 
జనరల్ విభాగం పోస్టులకు: ఓసీ/ఓబీసీలు రూ.850,ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు రూ.100.
డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల పోస్టులకు: ఓసీ/ఓబీసీలు రూ.600,ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు రూ.100.ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్య తేదీలు:
జనరల్ విభాగంలోని పోస్టులకు వెబ్‌సైట్ లింక్ జూలై 18 నుంచి ఆగస్టు 9 వరకు.
డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల్లోని పోస్టులకు వెబ్‌సైట్ లింక్ జూలై 19 నుంచి ఆగస్టు 9 వరకు అందుబాటులో ఉంటుంది.
ఎగ్జామ్ ముఖ్య తేదీలు:
జనరల్ విభాగంలోని పోస్టులకు: ఫేజ్-1 ఆన్‌లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 4న;
                                              ఫేజ్-2 ఆన్‌లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 19న జరుగుతాయి.

డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల్లోని పోస్టులకు: పేపర్-1 ఎగ్జామ్ ఆగస్టు 27న;
                                                                  పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ ఆగస్టు 28న జరుగుతాయి.
వెబ్‌సైట్: www.rbi.org.in
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment