చార్మినార్‌ ఎక్కిన రామ్ చరణ్‌!


తెలుగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చార్మినార్ ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.. తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న ‘ధ్రువ’ సినిమాలో పాతబస్తీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అటుగా వచ్చిన చరణ్ తొలిసారి చార్మినార్ ఎక్కాడట! సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సంగీతం: హిప్‌ హాప్‌ ఆది

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment