హిందీలో కేసీఆర్ ప్రసంగం..

cm kcr speech at mission bhagiratha launching
మెదక్ జిల్లా గజ్వేల్ లోని కోమటిబండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ హిందీలో తన ప్రసంగాన్నీ ప్రారంభించారు. చాలా అంశాలో్ల రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిస్తోందని, రాష్ట్రాల తరపున ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత పాలన సాగుతోందని, ఈ ఘనత ప్రధానిదేనని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధిచెందుతున్నాయని కేసీఆర్ అన్నారు. అవసరమైనపుడు కేంద్రం సాయం కోరుతామని చెప్పారు. ఐటీఐఆర్, ఎయిమ్స్ కు ప్రధాని ఆశీస్సులు కావాలని, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కేటాయించాలని కోరారు, మోడీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment