రోబో-2 షూటింగ్ మళ్లీ షురూ!

robo-2 shooting started
‘రోబో’కు సీక్వెల్ గా ఎస్. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా రోబో -2 షూటింగ్ చెన్నైలో మళ్లీ ప్రారంభమయింది. ఈ సినిమాలో రజనీకాంత్‌ సరసన ఎమిజాక్సన్‌ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కనిపించనున్నా
రు. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాతో బిజీగా ఉండటంతో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను మినహాయించి ఇతర నటీనటులతో దాదాపు యాభై శాతం షూటింగ్‌ పూర్తిచేశారు. విశ్రాంతి కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్‌ వారం క్రితం చెన్నై రావడంతో  ఆదివారం ఉదయం చెన్నైలోని అయనావరంలో రోబో-2 షూటింగ్ మొదలుపెట్టారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment