మిషన్ భగీరథ పథకం ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ

telangana mission bhagiratha inaugurated by PM
ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'మిషన్ భగీరథ' తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.నల్లా తిప్పి మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించారు. మెదక్ జిల్లా గజ్వెల్ లోని కోమటిబండలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమంతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేసిన మోది తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సాయం కేంద్రం నుంచి ఉంటుందని చెప్పారు. నీటి సమస్య తీర్చేందుకు కేసీఆర్ ఎంతో శ్రమించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం మిషన్ భగీరథ పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన తిలికించారు. వెంట కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్రాత్రేయ, పీయూష్ గోయల్, అనంత్ కుమర్ లు ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర రాష్ట్రమంత్రులు ఉన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment