ప్రత్యేకహోదాపై విభజన చట్టంలో లేదా...

venkaiah naidu comments on AP special statu
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని స్పష్టంగా పేర్కొని ఉంటే ఇన్ని సమస్యలుండేవి కావని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా హోదాపై సందిగ్ధత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టిసారించారని ఆయన గుర్తుచేశారు. విభజన చట్టం మేరకు వివిధ పథకాల కింద నిధులను భారీగా కేటాయించినట్టు తెలిపారు. అమృత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 877 కోట్లు ఇచ్చామని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment