నెదర్లాండ్లో మోదీని కలిసిన క్రికెటర్ రైనా

Delighted to meet the man with golden vision narendramodi on his exceptionally constructive visit to the Netherlands
నెదర్లాండ్స్‌ ఆమ్‌స్టర్‌డమ్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా కలిశారు. ఫిబ్రవరిలో ట్వంటీ-20ల్లో ఆడిన సురేశ్‌ రైనా ప్రస్తుతం భార్య ప్రియాంకతో కలిసి యూరప్‌ టూర్లో ఉన్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ అక్కడికి రావడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకతో కలిసి ప్రధానితో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గోల్డన్‌ విజన్‌ ఉన్న వ్యక్తి మోదీ అని, ఆయన నెదర్లాండ్స్‌ పర్యటన నిర్మాణాత్మకమని ప్రశంసించారు. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదట పోర్చుగల్‌, అమెరికాలో పర్యటించి అనంతరం నెదర్లాండ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment