అక్టోబర్‌ 27 నుంచి జగన్ పాదయాత్ర!

Jagan padayatra starts on October 27
ఇటీవల నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమల కొండ మీద దేవుడి దర్శనం చేసుకొని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తానని చెప్పారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాటలో నడిచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని చెప్పారు. ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. దాదాపు ఆరు నెలల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment