మద్య నిషేధం సాధ్యమేనా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్  అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చారు. మద్యం ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతోందని, ఎన్ని జీవితాలు సర్వనాశనమవుతున్నాయో తనకు తెలుసునని చెప్పారు. రోడ్ల మీద జరిగే ప్రమాదాలే కాదు.  మద్యం కారణంగా లక్షల ఇళ్లల్లో మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయన్నారు. అయితే మధ్య నిషేధం అసలు సాధ్యమయ్యే ప్రక్రియ కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మద్య నిషేధం అన్నది ఒక్కరోజులో అమలు సాధ్యం కాదు కాబట్టే మూడు దశల్లో చేస్తానని జగన్ పేర్కొన్నప్పటికీ అంత సువులుగా కుదిరే పని కాదని విశ్లేషిస్తున్నారు. మద్య నిషేధంలో భాగంగా మద్యం ధరలను పేద, మద్య తరగతి వారికి అందుబాటులో లేకుండా షాకు కొట్టేలా పెంచుతామని జగన్ ప్రకటించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ధరలను చూసి మద్యాన్ని సేవించకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారిన కొందరు అధిక మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేస్తే కుటుంబాలు ఇంకా నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇదిలా ఉండగా మద్యాన్ని స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంచడాన్ని  కూడా తప్పుపడుతున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment