జగన్ నవరత్నాలివే!

jaganmohan reddy nine welfare schemesవైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రారంభించబోయే తొమ్మిది పథకాలను ఆ పార్టీ ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో ప్రకటించారు. పేదల కోసం నవరత్నాల్లాంటి తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
1. వైఎస్సార్‌ రైతు భరోసా
ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50 వేలు. ఏటా మేలో నాలుగేళ్ల పాటు రూ.12,500. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి.
2. వైఎస్సార్‌ ఆసరా
డ్వాక్రా రుణాల మాఫీ.  4 దఫాలుగా నేరుగా చేతికే నగదు. 15 వేల కోట్లు మాఫీ. సున్నా వడ్డీకే రుణాలు.
3. పింఛన్ల పెంపు
వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ రూ.1000 నుంచి 2000లకు పెంపు
4. అమ్మఒడి
ఒక ఇంట్లో ఇద్దరి పిల్లలకు.. 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ. వెయ్యి, 6 నుంచి 10వ తరగతి దాకా రూ.1500, ఇంటర్‌ చదువులకు రూ. 2000లు. తల్లులకే నేరుగా.
5. పేదలందరికీ ఇళ్లు
పేదలందరికీ ఇళ్లు. ఇల్లు ఇచ్చే రోజునే మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌. ఇంటిపై పావలావడ్డీకే రుణం.
6. ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం
ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు. సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బతకడానికి డబ్బులు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా పింఛన్‌.
7. ఫీజు రీయింబర్స్‌మెంట్‌
చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20 వేలు.
8. జలయజ్ఞం
జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాజెక్టుల పూర్తి.
9. దశల వారీగా మద్య నిషేధం
మూడు దశల్లో మద్య నిషేధం
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment