జగన్‌ హామీలను టీడీపీ తిప్పికొడుతుందా!

tdp plans on jagan nine schemes
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన తొమ్మిది హామీలకు దీటుగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. టీడీపీ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు సంతోషంగా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకుని సంబరపడుతోంది. మూడేళ్లలో తమ ప్రభుత్వం శాఖల వారీగా ఏం చేశాం, ఎంత నిధులు ఖర్చు చేశాం, ఎంతమందికి లబ్ది చేకూర్చామనే విషయాలను కూడా జనానికి వివరించాలని అధినేత పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ప్రతిపక్షం హామీలను ప్రకటించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో తాము కూడా ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోవాలని, నాయకులు స్పీడు పెంచాలని పార్టీ వర్గాలను పిలుపునిస్తున్నారు. మొత్తానికి జగన్ హామీలు జనంలోకి విస్తృతంగా వెళ్లకుండా టీడీపీ తిప్పికొడుతుందో చూడాలి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment