వరుణ్‌ సందేశ్‌ వైఫ్ వైరల్ వీడియో

varun sandesh wife viral video
టాలీవుడ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను వితిక ఖండించారు. తమపై వచ్చిన రూమర్లు అన్నీ ఫేక్‌ అని కొట్టిపాడేశారు.   వరుణ్తో సంతోషంగా ఉన్నానని పుకార్లను నమ్మొద్దని వితిక ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కూడా వెల్లడించారు. విదేశాలనుంచి తిరిగి వచ్చిన తనకు రాత్రిళ్లు నిద్రపట్టకపోవడంతో డాక్టర్ సలహా మేరకు మాత్రలు వేసుకున్నానని తెలిపారు. ఎంతకూ నిద్రపట్టకపోవడంతో నాలుగు వేసుకోవడం వల్ల డోస్ పెరిగిందని తెలిపారు.

‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో వరుణ్‌-వితిక జంటగా నటించారు. అప్పుడు మొదలైన వీరి ప్రేమ.. కొన్నాళ్ల డేటింగ్‌ అనంతరం వివాహ బంధంగా మారింది. గత ఏడాది ఆగస్టులో వరుణ్‌-వితికల వివాహం జరిగింది. కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment