ఇ.పి.ఎస్., ఒ.పి.ఎస్.లు మోసగాళ్లు!

dinakaran comments on EPS-OPS

తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని డి.ఎం.కె. చీలిక వర్గం నేత దినకరన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడం విషయంలో న్యాయస్థానంపై నమ్మకముందని, హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్నారు. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితి ఉందన్నారు. శశికళను పార్టీ నుంచి తొలగించిన ఇ. పళనిస్వామి (ఇ.పి.ఎస్‌.), ఒ.పన్నీర్‌ సెల్వం (ఒ.పి.ఎస్‌)లు మోసగాళ్లుగా గుర్తుండిపోతారన్నారు. పన్నీర్‌ సెల్వం 'బాహుబలి'లో కట్టప్పలాగా వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారన్నారు. పోలీసులు ఉగ్రవాదులను వెంటాడినట్టు మా  ఎమ్మెల్యేలను వెంటాడుతున్నారన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment