కేసీఆర్.. ఎనిమిదో నిజాం!


సీఎం కేసీఆర్ ప్రతీ స్కీమ్‌ లోనూ భారీ స్కామ్‌ ఉందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఎనిమిదో నిజాం నవాబులా, నియంతలాగా వ్యవహరిస్తూ గొర్రెలు, బర్రెలు, చేపలు, చెట్లు, చీరలు అంటూ జనాలను మభ్యపెడుతున్నారన్నారు. సీఎం తక్షణమే తెలంగాణ అక్కాచెల్లెళ్లకు  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజులు ఎదురు చూసిన మహిళ లకు రూ.30 ఖరీదున్న చీరలిచ్చి అవమానించారన్నారు. వైన్‌షాప్‌లకు సమయం పెంచి రూ.26వేల కోట్ల ఆదాయం పెంచు కున్నారని, ఇలాంటి నీచమైన పనుల కోసమా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నిం చారు. నల్లగొండ ఉపఎన్నికొస్తే పోటీకి సిద్ధమని, ఎంపీగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీచేసినా పనిచేస్తానని చెప్పారు. తాను పోటీచేస్తే వరంగల్‌లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓట్లకన్నా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment